Motkupalli narasimhulu biography template

కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి.. ఆయన కండీషన్‌కు హస్తం పార్టీ ఓకే చెప్పిందా?

Authored byసందీప్ పూల | Samayam Telugu | Updated: 27 Oct 2023, 2:47 pm

Subscribe

ఎన్నికల వేళ పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు పక్క పార్టీల్లోకి వలసలు వెళ్తున్నారు.

తాజాగా.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నీలం మధు ముదిరాజ్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైలైట్:

  • కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు
  • హస్తం గూటికి చేరిన మోత్కుపల్లి
  • తుంగతుర్తి నుంచి బరిలో దిగే అవకాశం
Samayam Telugu
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెగురుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా మాజీమంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణ ఏర్పడిన తరువాత ఏ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించలేదు. కొన్నేళ్ల క్రితం బీఆర్ఎస్‌లో చేరిన మోత్కుపల్లి.. తనకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. అయితే మోత్కుపల్లి విజ్ఞప్తిని కేసీఆర్ పట్టించుకోలేదు.

అప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న.. ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌తో భేటీ అయిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైననట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తుంగతుర్తి టికెట్ తనకు కేటాయించాలని మోత్కుపల్లి కండీషన్ పెట్టినట్లు తెలిసింది.

గతంలో ఆయన తుంగతుర్తి నుంచే ఎమ్మెల్యేగా వ్యవహరించారు. తాజాగా కూడా ఆయన అదే సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సీటు కోసం కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్ సహా అనేక మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మోత్కుపల్లి నర్సింహులుకు కాంగ్రెస్ తరపున తుంగతుర్తి నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందా ? లేక ఏదైనా నామినేటేడ్ పదవిపై ఆయనకు కాంగ్రెస్ హామీ ఇస్తుందా ?

అన్నది చూడాలి.

ఇక పటాన్‌చెరు నియోవజకవర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. టికెట్ రాకపోవటంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపి తాజాగా.. ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు.

Facebook page yingluck shinawatra biography

ఆయనకు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... ఇంకా చదవండి

Grigory zinoviev biography of abraham